ఒంగోలు అర్బన్: ఒంగోలు మున్సిపల్ కార్యాలయం ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jul 2, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం కలెక్టర్ రాజబాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో నిర్లక్ష్యంగా పనులు జరగడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను సకాలంలో చేయాలనే లేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోవాలని సిబ్బందిపై కలెక్టర్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని వెంటనే ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా వర్కలు పూర్తి చేయాలన్నారు. సర్ సర్వే కార్యక్రమం కూడా త్వరగా పూర్తి చేయాలని లేకపోతే చర్యలు తప్పవని ఉన్నారు.