ఎం తుర్కపల్లి: మండల కేంద్రంలో పోచమ్మకు ఘనంగా బోనాల పండుగ, నృత్యాలు చేస్తూ అలరించిన యువకులు
యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం పోచమ్మకు ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. బోనాల పండుగను పురస్కరించుకొని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుర్కపల్లి మెయిన్ రోడ్డు నుండి డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి వేరువేరుగా మొక్కులు చెల్లించుకున్నారు. యువకులు డాన్సులు, నృత్యాలతో, ఊరేగింపులతో బోనాల పండుగను జరుపుకున్నారు . అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని, బోనాన్ని తలపై పెట్టుకుని శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా తరలి వెళ్లి పోచమ్మ తల్లికి బోనం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.