గిద్దలూరు: రాచర్ల మండలం జేపీచెరువు లోని శ్రీ నెమలికొండ రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలో ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఏప్రిల్ 2 నుంచి 5వ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని ఈ నేపథ్యంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.