ధర్మవరంలో సచివాలయ ఉద్యోగస్తుల సమ్మె నోటీసు.. వాలంటీర్లు చేసే పనులు తమతో చేయిస్తున్నారంటూ ఆగ్రహం.
ధర్మవరం మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణకు సోమవారం గ్రామ సచివాలయ ఉద్యోగులు సమ్మె నోటి సమ్మె చేశారు. సచివాలయ ఉద్యోగస్తుల సంఘం నాయకుడు మహబూబ్ మాట్లాడుతూ ఉద్యోగంలో చేరి ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న ప్రమోషన్లు లేవని, 9 నెలలుగా అరియర్స్ ఇవ్వలేదని పైగా వాలంటీర్లు చేసే పనులన్నిటిని తమకు అప్పగించి పని భారం మోపుతున్నాన్నాడు.రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు సమ్మె నోటీసు ఇచ్చినట్లు తెలిపారు.