ఆత్మకూరు: కృష్ణాపురంలో విద్యార్థిపై దాడికి పాల్పడి వాష్ రూమ్ లో లాక్ చేసి ఉంచిన వైస్ ప్రిన్సిపాల్, సస్పెండ్ చేసిన అధికారులు
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ స్కూల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి స్టడీ అవర్స్ లో మహేష్ అనే విద్యార్థిపై ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పెత్తన స్వామి దాడికి పాల్పడ్డారు. దీంతో మహేశ్ తలకు తీవ్ర గాయం అయ్యింది. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని వాష్ రూమ్ లో లాక్ చేసి ఉదయం వరకు లాక్ తియ్యొద్దని స్టాఫ్ ను హెచ్చరించారు. టీచర్లు కలిసి విద్యార్థిని మర్రిపాడు ఆస్పత్రికి తరలించారు. దింతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పెత్తన స్వామి సస్పెండ్ కు గురయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నవోదయ పాఠశాలకు ఫ్యాక్స్ ద్వారా అధికారులు ఉత్తర్వులు జారీ చే