అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జెడ్.వీరారెడ్డి కాలనీలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు, యువతులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కాలనీలో మంగళవారం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గులు వేశారు. కాలనీలో మహిళలు, యువతులు వేసిన వివిధ రకాల ముగ్గులు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ గుత్తి మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ ముగ్గులు, ఆటల పోటీల్లో విజేతలకు సంక్రాంతి పండుగ అనంతరం కనుమ రోజున బహుమతులను అందజేస్తామని అన్నారు. మహిళలు, యువతులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కాలనీలో పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు.