కడప: వర్షాల కారణంగా పనులు లేక నష్టపోయిన చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శివ
Kadapa, YSR | Oct 29, 2025 ప్రస్తుతం కురుస్తున్న తుఫాను వర్షాలు కారణంగా పనులు లేక నష్టపోయిన చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరనాల.శివనారాయణ తెలిపారు.బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక మండల సమావేశం స్థానిక ఎన్జీవో కార్యాలయం నందు జరిగింది. ఈ సందర్భంగా శివనారాయణ మాట్లాడుతూ మోంథ తుఫాను కారణంగా అటు ప్రజలు,రైతులు రాష్ట్రంలో,జిల్లా లో సతమతం అవుతూ నష్టపోయారన్నారు. అందులో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గం, సింహాద్రిపురం, మాధవరంలోని ఎక్కువ శాతం మంది మగ్గాలు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అన్నారు. వారిని ఆదుకోవాలని అన్నారు.