నంద్యాల అర్బన్: రక్తదానం చేసి ప్రేమదాతలుగా నిలవండి యువతకు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల పిలుపు
Nandyal Urban, Nandyal | Jun 14, 2026
యువత ముందుకు వచ్చి ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చిట్టిబాబు, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ వరలక్ష్మి, స్వాతి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రక్తదానం మహాదానమని, సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు.