కూసుమంచి: భారీ వర్షానికి దెబ్బతిన్న చెరుకు పంట ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు
కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల కారణంగా రైతులు సాగు చేసిన చెరకు, పత్తి, మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎకరాల కొద్దీ పంట నష్టం జరగడంతో పత్తి పంటలు ఎర్రబారిపోయాయి. నష్టపోయిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు కోరారు