నారాయణ్‌ఖేడ్: నాగలిగిద్ద జడ్పిహెచ్ఎస్ హెచ్ఎం సిద్ధారెడ్డి విధులు నిర్వహించాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన కేవీపీఎస్ బాధ్యులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నాగలిగిద్ద జడ్పిహెచ్ఎస్ హెచ్ఎం సిద్ధారెడ్డి స్థానికంగా విధులు నిర్వహించాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గణపతి సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తహసిల్దార్ శివకృష్ణకు వినతిపత్రం అందించారు. స్థానికంగా విధులు నిర్వహించకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముండతా అధికారులు స్పందించి నాగలిగిద్దలో జడ్పీహెచ్ఎస్ విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.