వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: ప్రముఖ గాయని వరం
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని ప్రముఖ తెలుగు గాయని వరం మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి ముందుగా కోడె మొక్కులు చెల్లించుకున్నారు.అందరిని చల్లగా చూడు స్వామి అంటూ వేడుకున్నట్లు తెలిపారు.అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం రద్దీగా మారింది.స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,ప్రభుత్వ అధికారికారులు స్వామివారి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు ఆలయ అభివృద్ధిని చాలా బాగా చేస్తున్నారని, ఈ అభివృద్ధిని అంతా చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. మళ్లీ స్వామివారి దర్శనానికి వస్తానన్నారు.