తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ప్రధాన రైల్వే గేట్ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. ఈ మార్గంలోని రైల్వే గేటు LC-60 మరమ్మతుల కారణంగా గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి శుక్రవారం రాత్రి 11 గంటల వరకు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకులు, వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.