కోడుమూరు: కోడుమూరులో పత్తి సాగుపై రైతులకు అవగాహన సదస్సు, జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారి హాజరు
కోడుమూరు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం మధ్యాహ్నం పత్తి సాగులో భద్రతాచర్యలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై మారి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నవ్య, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, చీడపీడల నివారణ, అధిక దిగుబడులు సాధించడం, వ్యవసాయం లాభసాటిగా రూపొందించుకోవడం అంశాలపై అధికారులు వివరించారు. సాగు అంశాలకు సంబంధించిన చార్ట్లు విడుదల చేశారు. రైతులకు సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. సదస్సుకు రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.