ఎగువ అహోబిలంలో 21 నుంచి 30 వరకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు, ప్రధాన అర్చకులు కిడంబి మధుసూదన్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఎగువ అహోబిలంలో ఈనెల 21 నుంచి 30 వరకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు, అహోబిలం దేవస్థానం ప్రధాన అర్చకులు కిడంబి మధుసూదన్ తెలిపారు, శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోని ఏ క్షేత్రంలో లేని విధంగా అహోబిల క్షేత్రంలో ప్రతి ఏటా రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు, తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలు ఉంటాయన్నారు, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు