ప్రముఖ క్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం పర్యటించారు. పెంచలకోన ఆలయ ప్రాంగణంలో రూ.6.50 కోట్ల నిధులతో శ్రీ ఆదిలక్ష్మీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరిక మేరకు అనేక ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు... వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ధ్యాన మందిరానికి శంకుస్థాపన చేసి నిధులిచ్చామన్నారు.