జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నాయకుల కోడ్ ఉల్లంఘించారని ఢిల్లీలోని ఈసీకి బి ఆర్ ఎస్ ఎంపీ లు గురువారం ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్ల రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో తక్షణమే కేంద్ర బలగాల నియమించి, ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.