ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లాలో పర్యటించిన మంత్రి సవిత, ఫోను ద్వారా విద్యార్థి తల్లితో మాట్లాడి ఫ్రీ బస్సు గురించి అడిగిన మంత్రి
Ongole Urban, Prakasam | Jul 14, 2026
ప్రకాశం జిల్లా టంగుటూరులో గురుకుల పాఠశాలలో పే ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మంత్రులు స్వామి, సవిత దీన్ని పరిశీలించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం మంత్రి సవిత 10వ తరగతి విద్యార్థిని నాగతేజస్విశి తల్లితో ఫోన్లో మాట్లాడారు. పాఠశాల ఎలా ఉంది? ఫ్రీ బస్ ఎక్కారా? అనే ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈ వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.