అన్నమయ్య జిల్లాలో ఈనెల 16 నాటికి 49.160 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. జిల్లాలో 45 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 15 మంది రైతుల నుండి రూ.11.74 లక్షల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి, 24 గంటల్లోనే పూర్తిగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ధాన్య సేకరణ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించాలని కోరారు.