రాజేంద్రనగర్: కుమ్మరి కుంటలో గుర్రపు డెక్క తొలగింపు
బతుకమ్మ వేళ కుమ్మరి కుంట వద్ద విద్యుత్ దీపాలు, పరిసరాలు పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి సూచించారు. మహిళలకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా కుంటలో గుర్రప్ప డెక్కను నీటి కలుపు (FTC-Floating Trash Collector) శుభ్రం చేయించారు. సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవరెడ్డి, ఎంటమాలజీ AE రవీందర్ రెడ్డి, సూపర్వైజర్ కుమార్, శ్రీనివాస్, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.