ఉరవకొండ: చౌక ధాన్యపు దుకాణాన్ని తనిఖీ చేసిన రెవిన్యూ అధికారులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని నాలుగవ నెంబర్ ప్రభుత్వ చౌక ధాన్యపు దుకాణాన్ని సోమవారం మండల రెవెన్యూ అధికార యంత్రాంగం ఆకస్మిక తనికి నిర్వహించారు. చౌక ధాన్యపు దుకాణంలో స్టాక్ రిజిస్టర్, పరిశీలించి వినియోగదారులకు పంపిణీ చేసి మిగిలిన సరుకులను తూకాలు వేసి పరిశీలించారు. తనిఖీ నివేదికలను ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందని మండల తహసిల్దార్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మధుసూదన్, ఆర్ ఐ నగేష్ బాబు విఆర్ఓ శ్రావణి, డీలర్ ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.