నందికోట్కూరు: బాలికల పాఠశాలలో ఉన్న కళాశాలకు అధ్యాపకులు నియమించాలి ఐద్వా మహిళా సంఘం నాయకురాలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉన్న కళాశాలకు అధ్యాపకులను నియమించాలని మహిళా సంఘం జిల్లా నాయకురాలు షాజిదాబి డిమాండ్ చేశారు, బుధవారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సందర్శించారు, అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు చదువుకోడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు, అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా పరిశీలించారు, కళాశాలలో అధ్యాపకులను నియమించాలని కోరారు