ఒంగోలు అర్బన్: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే విజయకుమార్
Ongole Urban, Prakasam | Apr 6, 2026
సోమవారం ఉండవల్లిలో రాష్ట్ర ఐటీ & విద్య శాఖ మంత్రివర్యులు జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అతని నివాసంలో కలిసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు విజయ్ కుమార్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు మరియు పార్టీ కార్యక్రమాల గురించి చర్చించారు.అమ్మానబ్రోలులో APRS Girls స్కూల్ ను అభివృద్ధి చేయాలనీ లోకేష్ కోరారు. సంతనూతలపాడు గ్రామంలో పేదల ఇళ్ల స్థలాల గురించి చర్చించారు.సంతనూతలపాడు నియోజకవర్గంలోని పెర్నమిట్టలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ నందు పలు ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే లోకేష్ ని ఆహ్వానిస్తే ఖచ్చితంగా వస్తాను అని హామీ ఇచ్చారు అని తెలిపారు