బనగానపల్లె: రాష్ట్రంలో నిరుద్యోగులను నిండా ముంచారు: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని
కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి రెండేళ్లుగా నిరుద్యోగులను నిండా ముంచిందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు.బుధవారం బనగానపల్లె వైసీపీ కార్యాలయంలో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పోస్టర్ ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలను అబద్ధపు హామీలతో బాబు వెన్నుపోటు పొడిచారన్నారు. మహానాడులో జగన్పై విమర్శలు తప్ప అభివృద్ధి ఊసే లేదని మండిపడ్డారు.