అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేట వద్ద శుక్రవారం నాలుగున్నర గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోత్రీయ భూములు సమస్యపై స్థానిక ప్రజలతో ప్రత్యేకంగా సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పాపంపేటలో 932 సోత్రీయ భూములను కబ్జా చేసేందుకు ₹296 ఎకరాల అన్ రిజిస్టర్ జిపిఏను అడ్డుపెట్టుకొని 20 ఎకరాల రిజిస్ట్రేషన్ జిపిఎన్ ముందు పెట్టుకుని 176 ఎకరాల భూములు వ్యవసాయ భూములుగా చూపించి పొజిషన్ సర్టిఫికెట్ పొందేందుకు సర్వే వీఆర్వో , రాయచూరు కిరణ్ వెంకటరమణ శ్రీరాములు భూమి ఆక్రమించుకుంటున్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.