ఆళ్లగడ్డ: పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, ఆళ్లగడ్డ సీఐ యుగంధర్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు చెరువులు బావులకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆళ్లగడ్డ పట్టణ సీఐ యుగంధర్ సూచించారు, ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నీటి నిల్వల లోతు తెలియకుండా చిన్న పిల్లలు ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, పిల్లల కదలికపై నిరంతరం నిఘా ఉంచాలని, ప్రమాదకరమైన జలాశయాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ సూచించారు.