నంద్యాల అర్బన్: బసాపురంలో త్రాగునీటి కష్టాలు
Nandyal Urban, Nandyal | May 4, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం బసాపురం గ్రామంలోని ప్రజలకు వేసవిలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవి పది రోజుల నుంచి ట్యాంకులకు సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు. మోటార్ సాంకేతిక సమస్యతో చెడిపోవడంతో తాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి మోటర్ ను రిపేరు చేసి,తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.