నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో దశాబ్దాల క్రితం నిర్మించిన పలు దుకాణాల సముదాయం షాపింగ్ కాంప్లెక్స్ శిథిలావస్థకు చేరి పూర్తిగా దెబ్బతింది, దీంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, 30 సంవత్సరాల క్రితం ఆళ్లగడ్డ మేజర్ గ్రామపంచాయతీగ ఉన్నప్పుడు ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది, కాలక్రమమైన సరైన నిర్వహణ లేకపోవడంతో స్లాబ్ కడ్డీలు బయటపడి చాలా వరకు దుకాణాలు దెబ్బతిన్నాయి, ఎలాంటి ప్రమాదం సంభవించక ముందే మున్సిపల్ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ మరమ్మత్తులు చేపట్టాలని వ్యాపారులు కోరారు