బనగానపల్లె: అవుకు రిజర్వాయర్ నుంచి సాగునీటి వృధా అరికట్టేందుకు చర్యలు చేపట్టిన అధికారులు
అవుకు రిజర్వాయర్ నుంచి కొత్త కాల్వ ద్వారా సాగునీరు వృథా కాకుండా ఎస్ఆర్బీసీ అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణ సమీపంలోని కల్వర్టుకు అడ్డుపడిన నాపరాళ్ల వేస్టేజీ, బండరాలను అవుట్సోర్సింగ్ లస్కర్లు బుధవారం తొలగించారు. రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గుతున్నందున, తాగునీటి వృథాను పూర్తిగా అరికట్టాలని స్థానిక రైతన్నలు అధికారులను కోరుతున్నారు.