ప్రకాశం జిల్లా కొండపి మండలం తాటాకు వారి పాలెం లో చేపల వేటకు వెళ్లి చెరువులో పడి కొండయ్య అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు చెరువులో కొండయ్య పడిపోయినట్టుగా స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.