కోడుమూరు: బాస్కెట్ బాల్ పోటీ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
దివంగత ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీ విజేతలకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శనివారం రాత్రి బహుమతులు ప్రధానం చేశారు. గౌతమి రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన పోటీల సందర్భంగా గెలుపొందిన టీం లను ఎమ్మెల్యే అభినందించారు. విద్యతో పాటు క్రీడల్లో పాల్గొనాలని, ప్రభుత్వం క్రీడా కోటా కింద 3 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తుందన్నారు.