డోన్: డోన్ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక నిఘా
Dhone, Nandyal | May 5, 2026 నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారి 44పై మంగళవారం ఎంవీఐ క్రాంతి కుమార్, డీఎస్పీ శ్రీనివాస్ బ్లాక్ స్పాట్స్ను పరిశీలించారు. ప్యాపిలి వరకు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి తగు సూచనలు చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ ఇంతియాజ్ భాష, నంద్యాల జిల్లా ఆర్టీసీ అధికారిణి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.