నిమ్మనపల్లె ప్రాజెక్టులో సందర్శకులకు అనుమతి లేదు.ఎస్సై. తిప్పేస్వామి.
అన్నమయ్య జిల్లా. మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం ముష్టురు గ్రామ సమీపంలో గల బహుద ప్రాజెక్ట్ లో సందర్శకులకు అనుమతి లేదని తిప్పేస్వామి హెచ్చరించారు. సీఐ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఎస్సై తిప్పేస్వామి శనివారం ప్రాజెక్టును సందర్శించి ప్రమాదకర ప్రదేశాలను పరిశీలించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిమ్మనపల్లె ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు. ప్రాజెక్టులో ఈత కొట్టడం దిగడం ప్రమాదకర కార్యకలాపాలకు అనుమతి లేదని ఎస్ఐ తెలిపారు.