అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా ఖాదర్ పేట రైల్వే స్టేషన్ లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి
Anantapur Urban, Anantapur | Apr 24, 2026
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని పామిడి మండలం ఖాదర్పేట రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుందని రైల్వే ఎస్సై వెంకటేష్ తెలిపారు. మృతదేహం పూర్తిగా గుర్తుపట్టని విధంగా ఉందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు.