కనిగిరి: పట్టణంలో 12 అడుగుల కొండచిలువ కలకలం, కొండచిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేసిన ఫారెస్ట్ అధికారులు
కనిగిరి పట్టణంలో ఆదివారం కొండచిలువ నివాస ప్రాంతాల్లో కలకలం సృష్టించింది. పట్టణంలోని శ్రీ కాశీనాయన గుడి వెనక ప్రాంతంలో నివాసాల వద్ద 12 అడుగుల కొండచిలువ ఉండడాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై ఫారెస్ట్ అధికారి ఉమామహేశ్వర్ రెడ్డికి సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆదేశాలతో డిఆర్ఓ రెడ్యా నాయక్, కనిగిరి బీట్ అధికారి నర్సింహం స్నేక్ క్యాచర్ ద్వారా కొండచిలువను పట్టుకొని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు.