నారాయణపేట్: ఫోటో ఎగ్జిబిషన్ కరపత్రాలను విడుదల చేసిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సివిఆర్ భవన్ లో ఆదివారం అందాజా ఐదు గంటల సమయంలో ఫోటో ఎగ్జిబిషన్ కరపత్రాలను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ ఫోటో అధ్యక్షులు రాజేష్ ఘాట్ మాట్లాడుతూ ఫోటో గ్రాఫర్ల సమస్యలను పరిష్కరించాలని మంత్రితో కోరారు. ఈనెల 19, 20, 21 తేదీలలో హైదరాబాద్ లో ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించడానికి రావాలని మంత్రిని పట్టణ ఫోటో అధ్యక్షులు రాజేష్ ఘాట్ కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.