ఆళ్లగడ్డ: హరివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని షణ్ముఖ ప్రియా జాతీయస్థాయి బేస్ బాల్ పోటీల కు ఎంపిక
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండల పరిధిలోని హరివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న షణ్ముఖ ప్రియా జూనియర్ జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్మోహన్ తెలిపారు, ఈనెల 5 నుంచి 7 వరకు గోనెగండ్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో నంద్యాల జిల్లా తరఫున ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికైందన్నారు, భువనేశ్వర్ లో 22వ తేదీ నుంచి జరిగే జూనియర్ జాతీయ స్థాయి బేస్ బాల్ పాల్గొంటుందని తెలిపారు, జాతీయ స్థాయికి ఎంపికైన షణ్ముఖ ప్రియాను ఉపాధ్యాయులు పలువురు ప్రముఖులు అభినందించారు