అనంతపురం అర్బన్: ఉప్పునేసిన పల్లి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ యువకుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 4, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు మండలం ఉప్పునేసిన పల్లి సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో అదే గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన తనని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.