బనగానపల్లె: పూలే ఆశయాలు కొనసాగిద్దాం : బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు అపారమని మంత్రి కొనియాడారు. మహానుభావుల ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు