బీబీపేట: ఘనంగా విజయదశమి వేడుకలు, జమ్మి ఆకులను మార్చుకుని శుభాకాంక్షలు
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో విజయదశమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని, జమ్మి చెట్టు వద్ద పూజలు నిర్వహించి, ఒకరికొకరు జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.