పటాన్చెరు: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని అక్కమ్మ చెరువు మత్తడి దూకుతుంది
జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని అక్కమ్మ చెరువు మత్తడి దూకుతుంది. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి సోమవారం ఉదయం అలుగు పారుతుంది. చెరువు మత్తడి నుంచి నీరు ప్రవహించడంతో పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి. ఈ అందమైన దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు తమ సెల్ఫోన్లో బంధిస్తున్నారు. చెరువు పూర్తిస్థాయిలో నీరు నిండడంతో స్థానిక రైతాంగం వర్షం వ్యక్తం చేస్తున్నారు.