చింతపల్లి మండలానికి మరో 20 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వచ్చింది: చింతపల్లి ఏవో మధుసూధనరావు
యూరియా ఎరువు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చింతపల్లి ఏవో మధుసూధనరావు రైతులకు సూచించారు. చింతపల్లి మండలానికి ఆదివారం మరో 20 మెట్రిక్ టన్నుల యూరియా లోడు వచ్చిందని తెలిపారు. చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే రైతు సేవా కేంద్రాల వద్ద కూడా యూరియా ఎరువు అందుబాటులో ఉందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.