బనగానపల్లె: బనగానపల్లెలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రజా దర్బార్లో మంత్రి BC జనార్దన్ రెడ్డి ప్రజల సమస్యలను సావధానంగా విన్నారు. కొలిమిగుండ్ల, అవుకు, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె మండలాల నుంచి అర్జీదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతులు సమర్పించారు. స్పందించిన మంత్రి, అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామని అన్నారు