ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో విజయలక్ష్మిగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు దర్శనం
ఆళ్లగడ్డలోని అమ్మవారి శాలలో దనరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం విజయలక్ష్మి దేవి అలంకరణలో శ్రీ వాసవి మాత దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీశ్ బాబు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఏడాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రోజుకో అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.