కావలి: దొంగల బీభత్సం...రాగి సామగ్రి అపహరణ...
కావలి మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అన్నగారిపాలెం వంతెన సమీపంలో మస్తాన్ మోటర్ వైండింగ్ షాపు ఉంది. అర్ధరాత్రి 1:30 గంటలకు దొంగలు వచ్చారు. సీసీ కెమెరా కనెక్షన్ కట్ చేశారు. షాప్ షట్టర్ ధ్వంసం చేసి రాగి సామగ్రి అపహరించుకుపోయారు. తుమ్మలపెంటలోనూ పలుచోట్ల దొంగతనాలు జరిగినట్లు సమాచారం. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.