ఆలమూరులోని ప్రభుత్వ కళాశాలను పునర్నిర్మించాలని జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ నేతల నిరసన
కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను పునర్నిర్మించాలని సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ రవికుమార్ మాట్లాడుతూ, జూనియర్ కళాశాల శిథిలావస్థకు చేరుకుని 20 సంవత్సరాలు దాటిందని, నాడు నేడు పథకం ద్వారా వెంటనే నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు.