డోన్ లో చలువ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కమిషనర్ కు వినతి పత్రం అందించిన బిజెపి నాయకులు
Dhone, Nandyal | Apr 13, 2026 ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కల్పించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సందు వెంకటరమణ ఆధ్వర్యంలో డోన్ కమిషనర్ ప్రసాద్ గౌడ్కు వినతిపత్రం అందించారు. రైల్వే గేట్లు, బస్టాండ్ వంటి ప్రజలు ఎక్కువగా రాకపోకలు చేసే ప్రాంతాల్లో చలువ పందిర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వేసవి కాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.