అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఎస్ఆర్ వైన్స్ వద్ద వ్యక్తిపై బీరు బాటిల్తో దాడి
Anantapur Urban, Anantapur | Apr 7, 2026
అనంతపురం నగరంలోని ఎస్ఆర్ వైన్స్ సమీపంలో రాఘవేంద్ర అనే వ్యక్తిపై అశోక్ కుమార్ అనే వ్యక్తి బీరు బాటిల్ తో దాడి చేసి గాయపరిచిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.