జిల్లా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీసులు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. దీని ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ నేర నియంత్రణ, భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు.అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తూ, నిషేధిత వస్తువులు, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తెలియని లింకులు క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీటు బెల్టు తప్పనిసరి అని తెలిపారు.