ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో, కాళికామాత అమ్మవారికి ఘనంగా చల్ల కార్యక్రమం
ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ కాళికా మాత అమ్మవారికి మంగళవారం చల్ల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు, విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మహిళలు భారీ సంఖ్యలో బోనాలతో మేళా తాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయం వెలుపల పెరుగన్నంతో చల్లని నైవేద్యంగా సమర్పించారు, ఈ వేడుకల్లో విశ్వబ్రాహ్మణ సోదరీ సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో మొక్కులు చేసుకున్నారు