కర్నూలు: కర్నూల్ నగరంలో హంద్రీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అటువైపు వెళ్లాలంటే వాహనదారులు భయాందోళన గురవుతున్నారు.
కర్నూలు నగరంలోని హంద్రీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గత నాలుగు ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కర్నూలు నగరానికి ఎగువ ఉన్న ప్రాంతం కల్లూరు కావడంతో కల్లూరు నుండి కర్నూలు నగరంలో హంద్రీ నది ప్రవహిస్తుంది. కల్లూరు ప్రాంతంలో వర్షం భారీగా కొరవడంతో వరద ప్రవాహం అంతకు అంతకు పెరుగుతుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కల్లూరు నుండి దేవ నగర్ కు వచ్చే హంద్రీ బ్రిడ్జి పై ప్రవాహం పెరగడంతో పాదాచారులు వాహనదారులు అటువైపు రాకండి అంటూ స్థానికులు సూచిస్తున్నారు. గంట గంటకు హంద్రీ నది ప్రవాహం పెరగడంతో పాదాచారులు వాహనదారులు ఆ బ్రిడ్జిపై వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు.